ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తా: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు నందకుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు

  • తనకు ప్రాణహాని ఉందని... న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరిన నందకుమార్
  • ఈ కేసులో తనను కావాలని ఇరికించారని ఆవేదన
  • ఫామ్ హౌస్‌లో ఏం జరిగిందనే విషయాన్ని త్వరలో బయటపెడతానని వెల్లడి
తనకు ప్రాణహాని ఉందని... తనకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నందకుమార్ కోరారు. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ నిందితుడిగా ఉన్నాడు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తనను కావాలని ఇరికించారని ఆరోపించారు. తనపై కక్షతోనే ఈ కేసులో ఇరికించారని.. తద్వారా తన వ్యాపారాన్ని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సింహయాజులును ప్రస్తుత బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ పరిచయం చేశారన్నారు. ఆ రోజు ఫామ్ హౌస్‌లో ఏం జరిగిందనే విషయాన్ని తాను త్వరలో బయటపెడతానన్నారు.

పోలీసులు గతంలో తనపై అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా వేధించారని ఆరోపించారు. డ్రగ్స్ కేసులోనూ ఇరికించాలని చూశారన్నారు. తనకు ప్రాణహాని ఉందని... అందుకే న్యాయం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అర్థిస్తున్నానని తెలిపారు. త్వరలో తాను ముఖ్యమంత్రిని, డీజీపీ రవిగుప్తాను కలిసి అన్ని వివరాలు వెల్లడిస్తానన్నారు.

Revanth Reddy
Congress
Telangana
nanda kumar

More Telugu News